Home Latest News ఖమ్మంలోనూ ఐటి పార్క్

ఖమ్మంలోనూ ఐటి పార్క్

It park, khammam

తెలంగాణలో ఐటి రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలన్న లక్ష్యంగా సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో పలు భాగంగా పలు జిల్లాలో ఐటి పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఖమ్మంలోనూ ఐటి పార్కు ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పార్కు పనులకు తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ 15న శంకుస్థాపన చేయనున్నారు.  ఇప్పటి వరకూ రాజధాని నగరం హైదరాబాద్ కే పరిమితం అయిన ఐటిని వరంగల్ తోపాటు పలు పట్టణాలకు విస్తరించాలని సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

                                  ఖమ్మం ఐటి పార్కు విషయాన్ని కెటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఖమ్మంలో 1.21 ఎకరాల్లో 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఐటి పార్కును అభివృద్ది చేయనున్నారు. ఈ పార్కులో 15 కంపెనీలకు స్పేస్ కేటాయించటం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించారు. సాధ్యమైనంత వేగంగా  ఈ పార్కు పనులను పూర్తి చేసేందుకు సర్కారు సిద్ధం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here