Home Latest News ఐసీస్‌లో 85 దేశాల నుంచి 30 వేల మంది ఫైటర్లు

ఐసీస్‌లో 85 దేశాల నుంచి 30 వేల మంది ఫైటర్లు

ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్న ఐఎస్ఐఎస్‌లో  2015 డిసెంబర్ నాటికి దాదాపు 85 దేశాల నుంచి 30 వేల మంది విదేశీ ఫైటర్లు ఉగ్రవాదులుగా చేరినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులుగా మారిన అనంతరం వారు తమ స్నేహితులు, బంధువుల, మతానికి చెందిన వారిని సానుభూతిపరులుగా మార్చుకుని ఆయాదేశాల్లో దాడులకు పాల్పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యాధికులే దీని పట్ల ఆకర్షితులు కావడం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ఐఎస్ఐఎస్‌లో ఎక్కువ మంది చేరుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మధ్య ప్రాచ్యం, అరబ్ దేశాల నుంచే ఎక్కువ మంది విదేశీ ఫైటర్లు ఐఎస్ఐఎస్‌లో చేరుతున్నా, ఐరోపా కూటమి దేశాలతో పాటు, అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ వంటి పాశ్చాత్య దేశాలు, రష్యా, ఇండోనేషియా, తజకిస్తాన్ వంటి దేశాల నుంచి కూడా వేలాది మంది విదేశీ ఫైటర్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా మారుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here