Home Andhra Pradesh నారాయణ కాలేజీలో విద్యార్ధిని ఆత్మహత్య

నారాయణ కాలేజీలో విద్యార్ధిని ఆత్మహత్య

suicide

విషాదం. ఓ ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి నారాయణకు చెందిన కాలేజీలోనే ఈ సంఘటన జరిగింది. గత కొంత కాలంగా నారాయణ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కడప  కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలేంటో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here