Home Cinema సినిమాల్లో బిజీబిజీగా మారుతున్న బిత్తిరి సత్తి

సినిమాల్లో బిజీబిజీగా మారుతున్న బిత్తిరి సత్తి

Iddari Madhya

బిత్తిరి సత్తి. ఈ పేరు తెలంగాణలో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. తెలంగాణలో కాదు..ఏపీలోనూ బిత్తిరి సత్తి పాపులరే. ఇప్పటివరకూ టెలివిజన్ రంగంలోనే పాపులర్ అయిన బిత్తిరి సత్తి ఇప్పుడు వరస పెట్టి సినిమాల్లో నటించేస్తున్నాడు. ఓ వైపు టీవీల్లో తన షో కొనసాగిస్తూనే..సినిమా ఛాన్స్ లు అందిపుచ్చుకుంటున్నారు. వీ6 ఛానల్ బిత్తిరి సత్తి ప్రోగ్రాం చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా  సత్తి ‘ఇద్దరి మధ్య 18’ సినిమాలోనూ కన్పించబోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 21న విడుదలకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..”ఇద్దరి మధ్య 18” చిత్రం మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ. చిత్రం అంతా అద్భుతంగా వచ్చింది. ఇటీవలె సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here