Home Andhra Pradesh ఐవైఆర్ పై వేటు పడింది

ఐవైఆర్ పై వేటు పడింది

I y r krishna rao

మాజీ సీఎస్…బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పై వేటు పడింది. ఆయన్ను ఏపీ ప్రభుత్వం తక్షణమే విధుల్లో నుంచి తొలగించింది. ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పదవి పొందిన కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడతున్నట్లు సోషల్ మీడియాలో దుమారం రేగింది. ముఖ్యంగా వైసీపీ పోస్టులను ఆయన తన వాల్ పై షేర్ చేయటం ప్రభుత్వ వర్గాల్లో కలకలంగా మారింది. అంతే ..వెంటనే వేటు వేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. సీఎస్ గా పదవి విరమణ చేసిన తర్వాత తనకు కొంత కాలం పదవి కావాలని..అదీ హైదరాబాద్ లో ఉండేలా ఇవ్వాలని చంద్రబాబును కృష్ణారావు కోరారు.

                          ఆయన పలు పోస్టులు కోరినా..చంద్రబాబు చివరకు బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. సీఎస్ గా చేసిన వ్యక్తి  ఈ పదవి తీసుకోవటం ఏమిటని అప్పట్లోనే ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కులాభిమానం ఉండటం తప్పు కాకపోయినా..సీఎస్ హోదాను తగ్గించారని అప్పట్లోనే ఐఎఎఎస్ లు విమర్శించారు. వైసీపీ చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన పోస్టులతో పాటు ఓ వెబ్ సైట్ వచ్చిన వార్తలను కూడా ఆయన షేర్ చేశారు. దీంతో ఆయన్ను పదవి నుంచి తప్పించి…ఈ పదవిని వేమూరి ఆనంద సూర్యకు ఇవ్వాలని నిర్ణయించారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here