Home Latest News తాజ్ మహల్ కూల్చేస్తానంటే మద్దతిస్తా

తాజ్ మహల్ కూల్చేస్తానంటే మద్దతిస్తా

Tajmahal

ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్‌ ఖాన్. దేశ రాజకీయాలు అన్నీ ప్రస్తుతం తాజ్ మహల్ చుట్టూనే తిరుగుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అజంఖాన్ తాజ్ మహల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాలో  తాజ్‌మహల్‌ ఫోటోను ముద్రించలేదు. దీని గురించి ప్రస్తావించలేదు కూడా. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు విస్మరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

                              ఈ పరిణామాల నేపథ్యంలో ఆజమ్‌ ఖాన్‌ స్పందించారు. తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయిస్తే తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. తాజ్‌మహల్‌ కూల్చివేయాలని ఆయన చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తాజ్‌మహల్ కూల్చి శివాలయం నిర్మించాలని గతంలో వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపారు. అక్కడితో ఆగకుండా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలను కూడా కూలగొట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూల్చివేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here