Home Telangana తెలంగాణ సర్కారుకు మరో షాక్

తెలంగాణ సర్కారుకు మరో షాక్

HighCourt

టీఆర్ఎస్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దీనికి సంబంధించి జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దీంతో  తెలంగాణ సర్కారుకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సర్కారు అర్హతలు లేకపోయినా మినహాయింపులు ఇస్తూ ముందుకు సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. సర్కారు తీరును తప్పుపడుతూ ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్ధులు కోర్టును ఆశ్రయించగా..కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇఛ్చింది.

                           అందులో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. జీవో 16ను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఈ ప్రక్రియ ఎక్కడికి అక్కడే ఆగిపోనుంది.  1996 త‌ర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేయ‌వ‌ద్దంటూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను ఇచ్చిన కోర్టు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here