Home Andhra Pradesh రిటైర్డ్ ఐఏఎస్ శ్యాంబాబుపై కేసు కొట్టివేసిన హైకోర్టు

రిటైర్డ్ ఐఏఎస్ శ్యాంబాబుపై కేసు కొట్టివేసిన హైకోర్టు

busi sambob

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి. శ్యాంబాబు కు బిగ్ రిలీఫ్. వైఎస్ హయాంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జి హబ్ కు భూ కేటాయింపులు జరిగాయి. అప్పట్లో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యాంబాబు లేపాక్షి నాలెడ్జి హబ్ లో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు..ప్రోత్సాహకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..మంత్రివర్గం ఆమోదంతోనే జరిగింది. అక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తే రాయితీలు వస్తాయి..లేకపోతే ఎలాంటి నష్టం ఉండదు. కానీ జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా సీబీఐ అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబుపై కూడా కేసు దాఖలు చేసింది. ఆయన ప్రతిపాదిత  ఫైలును  కేవలం ఆదేశాల కోసం పంపారే తప్ప..లేపాక్షి నాలెడ్జి హబ్ కు కానీ…మరే సంస్థకు ప్రయోజనం కల్పించేలా ఎక్కడా ఒక్క అక్షరం కూడా రాయలేదు. అయినా కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో అప్పట్లోనే ఏపీ ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా శ్యాంబాబు ప్రాసిక్యూషన్ కు అనుమతి నిరాకరించింది. తాజాగా హైకోర్టు ఈ కేసు నుంచి శ్యాంబాబుకు విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈ అధికారి పాత్ర ఏమీలేదని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఆయనపై అభియోగాలను కొట్టివేసింది. శాంబాబ్‌ ఐఏఎస్‌ అధికారిగా పదవిలో ఉన్న సమయం లోనే ఆయన విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని నిరాకరించాయని, ఆ తరువాత ఆయన పదవీ విరమణ చేశారని, అందువల్ల ఆయనను ఇప్పుడు విచారించడా నికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు.

                                  ‘ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండి, అతని విచారణకు ప్రభుత్వాలు అనుమతిని నిరాక రిస్తూ ఉత్తర్వులు జారీచేసినప్పుడు, ఆ ఉత్తర్వులను దర్యాప్తు సంస్థలు సవాలు చేయని పరిస్థితుల్లో, ఆ ఉత్తర్వులు ఫైనల్‌ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగిని విచారించడానికి వీల్లేదు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తి తన 19 పేజీల తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శాంబాబ్‌ గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి శుక్రవారం ఉదయం తీర్పునిచ్చారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు చేసిన 8841 ఎకరాల భూమి కేటాయింపులన్నీ కూడా బిజినెస్‌ రూల్స్, ఇతర నిబంధనల మేరకే జరిగాయి. ఈ కేటాయింపులన్నీ శాఖల ను సంప్రదించిన తరువాతనే జరిగాయి. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం ఆమోదం తరువాతనే లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌తో ఒప్పందం జరిగింది. అప్పటి కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. ఈవ్యవహారంలో అప్పటి పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్‌ ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదు. ఆయన చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావు. అందువల్ల అతని విచారణకు అనుమతినివ్వడం సాధ్యం కాదు.’ అని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో శ్యాంబాబుకు ఈ కేసు నుంచి పూర్తి ఊరట లభించినట్లు అయింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here