Home Top Stories హెరిటేజ్ షేరు ధరలో ఆ దూకుడేంటి?

హెరిటేజ్ షేరు ధరలో ఆ దూకుడేంటి?

HeritageFoods

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్ ఫుడ్స్’ స్టాక్ మార్కెట్ లో యమ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఆ కంపెనీ షేరు ధర ఏకంగా 1130 రూపాయలకు పెరగటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.  ఇది చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవున్నారు. చంద్రబాబు అధికార బాధ్యతలు చేపట్టడానికి కొంత ముందు  సమయంలో అంటే 2014 మార్చి-ఏప్రిల్ మధ్య ఈ షేరు ధర 190 నుంచి 220 రూపాయల మధ్య ఊగిసలాడింది. అదే ఏడాది జూన్ లో 344 రూపాయలకు చేరింది.  2015 జులై-అక్టోబర్ మధ్య కాలం ఇది 570 రూపాయల మధ్య ఊగిసలాడింది. ఆ తర్వాత కంపెనీ చేసిన  ప్రకటన కూడా మార్కెట్లో హెరిటేజ్ షేరు ధర పెరగటానికి కారణం అయింది. అదేంటి అంటే హెరిటేజ్ ఫుడ్స్ చేతిలో ఉన్న రిటైల్ డివిజన్ విక్రయించాలని నిర్ణయించటం. కొద్ది కాలం క్రితమే ఈ డివిజన్ ను ఫ్యూచర్ గ్రూప్ నకు విక్రయించిన సంగతి తెలిసిందే.

గతంలోఎన్నడూలేని రీతిలో హెరిటేజ్ పాల డివిజన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.  కొంత కాలం క్రితం హైదరాబాద్ మార్కెట్లో అమూల్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఏకంగా ఓ దశలో లీటర్ ధరను రెండు రూపాయల మేర తగ్గించింది. దీని కోసం భారీ ఎత్తున ప్రకటనలు కూడా ఇఛ్చింది. సహజంగా రేటు తగ్గిస్తే ఆ ప్రభావం కంపెనీ టర్నోవర్…లాభదాయకతపై కూడా ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ కంపెనీ షేరు మాత్రం ఎక్కడా ఆగకుండా దూసుకుపోతోంది. హెరిటేజ్ షేరు శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 17 2017 క్లోజింగ్ రేటు 1130 రూపాయలుగా ఉంది. ఈ షేరు 52 వారాల కనిష్ట ధర 485 రూపాయలు అయితే…52 వారాల గరిష్ట ధర 1173 రూపాయలు. ఏమైనా కూడా హెరిటేజ్ షేరు కదలికలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే హెరిటేజ్ షేరు ధర జోరుగా  పెరగటం చూసి విశ్లేషకులు …‘పవర్’కు పాలకూ సంబంధం ఉన్నట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here