Home Cinema ‘అఖిల్’కు నాగార్జున ఝలక్

‘అఖిల్’కు నాగార్జున ఝలక్

Akhil, kalyani

‘హలో’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన అఖిల్ కు అక్కినేని నాగార్జున చిన్న ఝలక్ ఇచ్చారు. అది ఎలా అంటే..అఖిల్ విడుదల చేద్దామనుకున్న పాట టీజర్ ను నాగార్జునే విడుదల చేశారు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘సారీ రా అఖిల్. ఇక ఆగలేను. నువ్వు స్పీడ్ అవ్వాలి’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నట్లు అఖిల్ ముందే ప్రకటించారు. అయితే ఆ ఛాన్స్ అఖిల్ కు ఇవ్వకుండా నాగార్జునే పూర్తి చేశారు.

‘మెరిసే మెరిసే ’ అనే పాటకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇందులో  అఖిల్, కళ్యాణి ఓ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ జోష్ లో ఉంటారు. ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున తెరకెక్కించారు.

సాంగ్ టీజర్ 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here