Home Andhra Pradesh అరకులో హెలీ టూరిజం

అరకులో హెలీ టూరిజం

Araku heli tourism

విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన అరకులో హెలీ టూరిజం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అరకు ఏకో టూరిజం ప్రాజెక్టును 110 కోట్లతో పూర్తి చేస్తామని తెలిపారు. లంబసింగి, దల్లాపల్లిలో రిసార్ట్ ల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో అరకులో బెలూన్ ఫెస్టివల్, వాటర్ ఫాల్, ఎల్లో ఫ్లవర్ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని తెలిపారు.

                 అరకు నియోజకవర్గంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో గవర్నర్ నరసింహన్ తో కలసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గిరిజనులతో కలసి నృత్యం చేశారు. దేశ..విదేశాల్లో థింసా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాది వ్యవధిలో అరకులో రహదారులను విస్తరించే పనులు పూర్తి చేస్తామని అన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here