Home Cinema పెళ్ళికొడుకు హీరోతో హెబ్బాపటేల్

పెళ్ళికొడుకు హీరోతో హెబ్బాపటేల్

Hebba-Patel

అందం. అభినయం ఆమె సొంతం. కానీ ఎందుకో ఆమె కు టాలీవుడ్ లో సరైన బ్రేక్ రావటం లేదు. ఛాన్స్ లు అయితే వస్తున్నాయి కానీ..అంతగా క్లిక్ కావటం లేదు. అయినా సరే మాత్రం అవకాశాలు ఆగటం లేదు. అది ఆమెకు ఒకింత సంతోషకర పరిణామమే కదా. ఇప్పుడు అదే జరిగింది. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ పెళ్ళి చూపులు హీరోతో కలసి ఈ అందాల భామ సందడి చేయనుందట.

                      యువ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాకు అంగీకరించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన హెబ్బా హీరోయిన్ గా నటించనుంది. ప్రియాంక లీడ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన మరో హీరోయిన్ పాత్రకు హెబ్బాను ఫైనల్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here