Home Latest News హరీష్ ను ఒంటరి చేశారు..ఆయన సీఎం కావటం ఖాయం

హరీష్ ను ఒంటరి చేశారు..ఆయన సీఎం కావటం ఖాయం

Harish Rao

ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్వే సత్యనారాయణ గురువారం మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత అవినీతికి పాల్పడుతూ మంత్రి హరీశ్‌ను ఒంటరి చేశారని ఆరోపించారు.

                       కేసీఆర్‌ కుటుంబ పాలనను బుద్ధి చెప్పేవరకు ప్రజలు నిద్రపోరని, దీనికి ఈ పాదయాత్ర నాంది పలుకుతుందని అన్నారు.  ఎస్సీ వర్గీకరణను పథకం ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని, మాదిగలంటే ఆయనకు చులకనగా ఉందని ఆరోపించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకపోయినా కేసీఆర్‌ తప్పుడు హామీలతో వారిని మోసగిస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here