Home Andhra Pradesh ఏపీలో భారీ ఎత్తున టీచర్ ఉద్యోగాలు

ఏపీలో భారీ ఎత్తున టీచర్ ఉద్యోగాలు

Ganta srinivasa rao

ఆంధ్రప్రదేశ్ సర్కారు నిరుద్యోగులకు చల్లటి కబురు అందించింది. డీఎస్సీ ద్వారా సర్కారు ఒకేసారి 12,370 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వివరాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు విడుదల చేశారు. 2018 జూన్ 12 నాటికి ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. దీని కోసం డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు.

మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అదే సమయంలో రూ. 5 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ కాలేజీలపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు. 1998, 2008, 2012 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కరించడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని..ఆ నివేదిక రాగానే చర్యలు ఉంటాయని తెలిపారు.

నోటిఫికేషన్‌ వివరాలు :

26-12-2017 నుండి 8-02-2018 వరకు దరఖాస్తుల స్వీకరణ

09.03.2018 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు

05.05.2018 న ఫలితాల విడుదల

2018 జూన్ 12 నాటికి పోస్టింగ్‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here