Home Cinema జూలై 8న ఆదిత్య ఓం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'

జూలై 8న ఆదిత్య ఓం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’. రోహిత్‌, ప్రకాష్‌, శీతల్‌, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్కర్‌, నితేష్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 8న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ – ”సోషల్‌ మీడియాకు యువత ఎలా బానిసలవుతున్నారు, తద్వారా వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే అంశాన్ని తీసుకొని మెసేజ్‌ ఓరియంటెడ్‌గా ఈ చిత్రాన్ని చేశాం. హార్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది. జూలై 8న ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here