Home Latest News ఫ్లిప్ కార్ట్ ‘సేల్’ మళ్ళీ వచ్చింది

ఫ్లిప్ కార్ట్ ‘సేల్’ మళ్ళీ వచ్చింది

flipkart-sale

డిస్కౌంట్లు..ఆఫర్లు. ముఖ్యంగా మొబైల్ ప్రేమికులకు పండగే. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోసారి ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ బిగ్ ఫ్రీడం సేల్ పేరుతో ఆఫర్లు ప్రకటించింది.  అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ను ప్రకటించిన ఐదు రోజుల్లోనే ఫ్లిప్‌కార్ట్‌ కూడా రంగంలోకి దిగింది. ఫ్లిప్ కార్ట్ సేల్  సేల్‌ ఆగస్టు 9న ప్రారంభమై, ఆగస్టు 11తో ముగుస్తోంది. బిగ్‌ ఫ్రీడం సేల్‌లో భాగంగా మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, హెడ్‌ఫోన్లు, కెమెరాలు, యాక్ససరీస్‌పై ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. షావోమి ఫ్యాన్స్‌ కు కోసం రెడ్‌మి నోట్‌ 4 సేల్‌ను 72 గంటల పాటు నిర్వహించనున్నట్టు కూడా పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు అదనంగా తక్షణ డిస్కౌంట్లను అందించనున్నట్టు వెల్లడించింది. బిగ్‌ ఫ్రీడం సేల్‌ కోసం ముందస్తుగానే ఫ్లిప్‌కార్ట్‌ తన వెబ్‌సైట్‌లో పలు డిస్కౌంట్లను ఆవిష్కరించింది. రూ.16,999గా ఉన్న మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.14,999కి అందించనున్నట్టు తెలిపింది.

                                   అదేవిధంగా రూ.15,999గా ఉన్న మోటో ఎం స్మార్ట్‌ ఫోన్‌ను రూ.12,999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 12,499 రూపాయలుగా గల లెనోవో కే5 నోట్‌ను 9,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌ విక్రయించనుంది. కే6 పవర్‌ స్మార్ట్‌ ఫోన్‌పై 1000 రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. దీంతో 9999 రూపాయలుగా ఉన్న కే 6 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.8999కే లభ్యం కానుంది. గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర 67వేల రూపాయల నుంచి 48,999 రూపాయలకు తగ్గించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అదేవిధంగా ఐఫోన్‌ 6, 32జీబీ మోడల్‌ ధరను కూడా తగ్గించినట్టు చెప్పింది. రెడ్‌మి నోట్‌ 4ను మూడు రోజుల పాటు 1000 రూపాయల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌ విక్రయించనుంది. కేవలం మొబైల్‌ ఫోన్లపైనే కాక ల్యాప్‌టాప్‌, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్‌ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here