Home Telugu అమెజాన్..ఫ్లిప్ కార్ట్ ల ’దీపావళి ధమాకా’

అమెజాన్..ఫ్లిప్ కార్ట్ ల ’దీపావళి ధమాకా’

flipkart-amazon

పండగలు వచ్చాయంటే సందడే సందడి. ఆఫర్ల మీద ఆఫర్లు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మీద అయితే లెక్కలేనన్ని ఆఫర్లు ఉంటాయి. సహజంగా పండగల సందర్భంగానే చాలా మంది కొత్త ఉత్పత్తులు కొంటుంటారు. ఆన్ లైన్ దిగ్గజాలు కూడా దీన్ని ఆసరా చేసుకునే సేల్ లు ప్రకటిస్తుంటాయి. అగ్రశ్రేణి ఈ కామర్స్ సంస్థలు అయిన అమెజాన్..ఫ్లిప్ కార్ట్ లు దీపావళికి ధమాకా ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. పలు ఉత్పత్తులపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇవ్వటంతోపాటు..రకరకాల ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇక వాటిని మీరు అందుకోవటమే ఆలశ్యం. అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది.  అక్టోబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 17 వరకు ఇది కొనసాగనుంది. సరిగ్గా అదే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌ కూడా తన బిగ్‌ దివాలి సేల్‌ను నిర్వహిస్తోంది.

                           అమెజాన్‌ ఈ దివాలి సేల్‌లో భాగంగా మొబైల్‌, యాక్ససరీస్‌, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వంటి వాటిపై డీల్స్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులకు ఈ సేల్‌లో అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా వచ్చేస్తుంది. 30వేల వరకు ఉత్పత్తులపై నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్‌ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు  తెలిపింది.  ఈ రెండు ఈ కామర్స్ సంస్థలు ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనే ఎక్కువ ఆఫర్లు ఇవ్వబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్డెన్‌ అవర్స్‌ డీల్స్‌ను అమెజాన్‌ ఆఫర్‌ చేయనుంది. స్పెషల్‌ ధన్‌తెరాస్‌ ఆఫర్లు కూడా ఉంటాయని ప్రకటించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here