Home Telugu ఫేస్‌బుక్‌లో పోస్టులపై తరగతులు

ఫేస్‌బుక్‌లో పోస్టులపై తరగతులు

facebook

సోషల్‌ మీడియా విస్తృతి రోజురోజుకీ మరింత ఎక్కువ అవుతోంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార మార్పిడి కొత్త పుంతలు తొక్కుతోంది. భవిష్యత్తులో కలిగే ప్రయోజనాల దృష్ట్యా కళాశాల స్థాయి నుంచే వినూత్న ఆలోచనలకు విశ్వవిద్యాలయాలు పెద్దపీట వేస్తున్నాయి. దేశంలో ప్రముఖమైన ఢిల్లీ‌ యూనివర్సిటీ ఆ బాటలోనే అడుగులు వేస్తోంది. తన పరిధిలోని ఇంగ్లిషు లిటరేచర్‌ విద్యార్థులకు ఫేస్‌బుక్‌ పోస్టింగులపై ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం ప్రణాళికలు రచిస్తోంది. పరిమితులకు లోబడి ఫేస్‌బుక్‌లో పోస్టులు చేయడం, నైపుణ్యాలను పెంచే చర్యల్లో భాగంగా బ్లాగ్‌ రైటింగ్‌, ఫ్రూఫ్‌ రీడింగ్‌ అంశాలపై విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. 

                          అకడమిక్‌ రైటింగ్‌లో భాగంగా ఫేస్‌బుక్‌ కోర్సును నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. ఫేస్‌బుక్‌ పోస్టులపై మాత్రమే కాకుండా ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ తొలి నవల ‘ఫైవ్‌ పాయింట్‌ సమ్‌వన్‌’ పైనా ‘జనరల్‌ ఎలెక్టివ్‌’ పేపర్‌లో చేర్చనున్నారు. విశ్వవిద్యాలయం తన ప్రతిపాదనలను అన్ని కళాశాలలకు పంపి సలహాలు, సూచనలు తెలపాల్సిందిగా కోరింది. ఫేస్‌బుక్‌ కోర్సు ఎలా ఉండాలనే దానిపై సూచనలు, సలహాలు వచ్చిన తరువాతే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here