Home Latest News ఏ మీట నొక్కినా బిజెపికే ఓటు

ఏ మీట నొక్కినా బిజెపికే ఓటు

evms

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవిఎం)ల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పనితీరులో అనేక లోపాలు ఉన్నాయని ప్రతిపక్షాల నుండి ఆరోపణలు వస్తున్నా సమయంలో ఆరోపణలు నిజమనిపించే సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకోవడం ఎన్నికల కమీషన్ ను కలవరానికి గురి చేస్తున్నది. భింద్‌లో తాజాగా జరిగిన నమూనా పోలింగ్‌లో ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేసినా అది బిజెపికి చేరింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.  మధ్యప్రదేశ్‌లోని భింధ్‌ నియోజకవర్గానికి ఈ నెల 9న ఉప ఎన్నిక జరుగునుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తొలిసారిగా ఓటర్‌ వెరిఫిబుల్‌ పేపర్‌ అడిట్‌ ట్రయిల్‌ (వివిపిఎటి) రసీదును ప్రవేశపెట్టన్నారు. ఈ నేపథ్యంలో దీంతో శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారులు, విలేకరుల సమక్షంలో నమూనా పోలింగ్‌, వివిపిఎటి పరీక్షను నిర్వహించారు. వివిపిఎటి అమలు చేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. శుక్రవారం జరిగిన నమూనా పోలింగ్‌లో ఏ మీట నొక్కినా ఓటు మాత్రం బిజెపికి పడింది. 
అందరి సమక్షంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇదే జరిగింది. ఏ అభ్యర్థికి మీట నొక్కినా, ఓటు మాత్రం బిజెపి కమలం గుర్తుకే చేరింది. వివిపిఎటి రసీదుల్లోనూ బిజెపి కమలం గుర్తుకే ఓటు వేసినట్లు వచ్చింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారులు ఖంగుతిన్నారు. ఎన్ని సార్లు ప్రయత్నించినా ఇదే జరగడంతో నమూనా పోలింగ్‌ను నిలివేశారు. ఈ వార్తను కవరేజ్‌ చేయద్దని విలేకరులకు అధికారులు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

                        ఈవిఎంలతో బిజెపి లబ్ధి పొందుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన వెలుగులోకి రావడం మరింతగా సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవిఎంలపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా నమోదయింది. ఈవిఎంల్లో ఎవరికి ఓటు వేసినా బిజెపికి చెందుతుండ టంతో ఎన్నికలను పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మధ్యప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈవిఎంలతో బిజెపి అక్రమాలకు పాల్పడుతుందని తాము ఎప్పటి నుంచే చెబుతున్నామని, భింద్‌ వార్తతో అది నిజమయిందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ నెల 9న భింద్‌తో పాటు జరిగే  ఉప ఎన్నికను కూడా పేపర్‌ బ్యాలెట్‌ తరహాలో నిర్వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here