Home Andhra Pradesh బాబోయ్ ఆ ఎడిటోరియల్ ప్రముఖుడి వసూళ్ళెన్నో!

బాబోయ్ ఆ ఎడిటోరియల్ ప్రముఖుడి వసూళ్ళెన్నో!

హైదరాబాద్ కేంద్రంగా వెలువడే రెండు ప్రధాన పత్రికలకు సంబంధించిన కీలక వ్యక్తుల వ్యవహారం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో దుమారం రేపుతోంది. ఓ పత్రిక ఎడిటర్..మరో పత్రిక ఎడిటోరియల్ ముఖ్యుడి వసూళ్ళ వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ  పబ్లిషింగ్ మాఫియా నుంచి కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్ళను ఉచితంగా పొందిన విషయాన్ని ‘తెలుగుగేట్ వే.కామ్’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ ఎడిటోరియల్ ప్రముఖుడి అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలోనూ ఆయన ఓ మంత్రి నుంచి కోటి రూపాయలు అందుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయం యాజమాన్యం వరకూ కూడా చేరినట్లు  సమాచారం. ఇప్పటికే అధికారుల్లో ఆ ఎడిటర్..ఎడిటోరియల్ ప్రముఖుడి వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. బయటకు మాత్రం నిత్యం నీతి, నిజాయతీల గురించి మాట్లాడే వ్యక్తులు ఇంత బరితెగింపా?అని అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ఎడిటోరియల్ ప్రముఖుడు కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో 70 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఎడిటోరియల్ ముఖ్యులకు కోట్ల రూపాయల ఇళ్ళను కొనుగోలు చేసిన ఇఛ్చిన వారే ఒక్కొక్కరికీ 45 లక్షల రూపాయల ఖర్చు పెట్టి మరీ ఇళ్లను అందంగా తీర్చిదిద్దినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పబ్లిషింగ్ మాఫియా అక్రమాలు ఏమీ వెలుగులోకి రాకుండా తమ వంతు పాత్ర పోషిస్తున్నారనే కారణంతో మాఫియా ప్రతినిధులు ఖరీదైన ఇళ్ళను వారికి బహుమతిగా ఇచ్చారు. ఎడిటర్, ఎడిటోరియల్ ముఖ్యుడికే కాదు..వారి పక్కనే  విద్యా  శాఖకు చెందిన ఉన్నతాధికారికి కూడా ఖరీదైన బంగ్లాను కొనిచ్చారు. ప్రస్తుతం ఈ అంశం సచివాలయంలో హాట్ టాపిక్ అయింది. ఏపీ విద్యా శాఖలో సర్వశిక్ష అభియాన్ పథ కం కింద ప్రతి ఏటా కోట్లాది రూపాయల పుస్తకాలను కొనుగోలు చేస్తుంది. అందులో సింహభాగం వాటాను ప్రతి సారి ఈ మాఫియానే దక్కించుకుంటుంది. అదే ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ఈ వార్తలు ఏవీ పత్రికల్లో ప్రచురణకు నోచుకోవు. ఎందుకంటే పబ్లిషర్లకు ఎడిటర్ల స్థాయి నుంచి అందరి అండదండలూ ఉంటాయి. విద్యా శాఖకు సంబంధించి ట్యాబ్ ల కొనుగోలు వ్యవహారం కూడా దుమారం రేపుతోంది. ఇందులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి రావటంతో ఈ కీలక వ్యక్తిపై విజయవాడలో పోలీసు కేసు కూడా నమోదు అయింది. అయినా ఏమీ కాదు అనే ధీమాతో ఆ వ్యక్తి ఉన్నాడు. ఎందుకుంటే అతన్ని రక్షించేందుకు ఎడిటర్, అంత కంటే పెద్ద వ్యక్తులే  ఉన్నారుగా. ఈ  ఎడిటర్లకు సంబంధించిన పుస్తకాలు కూడా వీళ్ళే చూస్తుంటారు. ముద్రణ దగ్గర నుంచి విక్రయాల వరకూ వీరిదే బాధ్యత. ఆయా పెద్ద మనుషుల నినాదాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. చేసేవి మాత్రం చిల్లర పనులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here