Home Latest News పడక సుఖమిస్తేనే సినిమాలో ఛాన్స్

పడక సుఖమిస్తేనే సినిమాలో ఛాన్స్

prostitution

ఇది ఓ డైరక్టర్ నిర్వాకం. సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కావాలంటే తనతో ఓ రాత్రి గడపాలనే కండిషన్ పెట్టాడు ఈ డైరక్టర్. అందుకు సమ్మతించని ఆ అమ్మాయి పోలీసు కేసు పెట్టింది. ఇప్పుడు పోలీసులు ఆ డైరక్టర్ కోసం వేట ప్రారంభించారు. ఇదంతా ఎక్కడ జరిగిందీ అంటే పుణేకు చెందిన అప్పా పవార్‌ అనే దర్శకుడు కలేవాడిలో చిరాగ్‌ పేరిట ఓ స్టూడియోను నడుపుతూ సినిమాలు తీస్తుంటాడు. తాజాగా తాను తీయబోయే సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. ఎప్పటి నుంచో హీరోయిన్‌ ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న కొరియోగ్రాఫర్‌ యువతి వారిని సంప్రదించింది.                       స్క్రీన్‌ టెస్ట్‌ కోసం వెళ్లినప్పుడు దర్శకుడితోపాటు ఇద్దరు నిర్మాతలు అక్కడే ఉన్నారు. మళ్లీ ఆగస్టు 6న రావాలంటూ ఆమెను పంపించేశారు.

                             చెప్పిన గడువు రోజు ఆమె వచ్చింది. అక్కడే జరిగింది అసలు సీన్. ‘మా సినిమాలో నటించే ఛాన్స్‌ కోసం నయా పైసా కూడా చెల్లించక్కర్లేదని ఆకాశ్ చెప్పాడు. అయితే ఓ పని చేయాలంటూ దర్శకుడి గదిలోకి నన్ను పంపాడు. అక్కడ పవార్‌ ఒక్కడే ఉన్నాడు. తాను తీయబోయే తర్వాతి రెండు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నన్నే తీసుకుంటానని, ప్రతిగా తనకు పడక సుఖాన్ని అందించాలని కోరాడు. అందుకు నేను నిరాకరించి బయటకువచ్చేశాన’ని బాధితురాలు చెబుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న దర్శకుడు పవార్‌ కోసం గాలిస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here