Home Latest News సర్టిఫికెట్స్ కావాలంటే కోరిక తీర్చాలన్న ప్రిన్సిపాల్

సర్టిఫికెట్స్ కావాలంటే కోరిక తీర్చాలన్న ప్రిన్సిపాల్

prostitution

అది ఓ ప్రైవేట్ స్కూల్. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన స్కూల్ లో ఏకంగా కరస్పాండెంట్ కీచకుడి అవతారం ఎత్తాడు. అదీ టీచర్ పై. కొన్ని రోజులు ఆ పాఠశాలలో పనిచేసిన టీచర్ రెండు నెలల క్రితం ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది. ఉద్యోగంలో చేరిన సమయంలో ఇఛ్చిన తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రిన్సిపాల్ ను కోరింది. ఈ మేరకు ఆమె స్కూల్ కు వచ్చి కరస్పాండెంట్ ను కలవగా..తన రూమ్ లోకి రావాలని పిలిచారు.

                          అక్కడకు చేరిన ఆమెకు అసలు విషయంలో చెప్పాడు. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. ఒప్పుకోకపోతే ఆమె గురించి చెడుగా ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిపోయిన టీచర్‌కు అసభ్య సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here