Home Politics సీఎం ఆఫీసుకు రాడు కాని సినిమాకెళ్ళాడు

సీఎం ఆఫీసుకు రాడు కాని సినిమాకెళ్ళాడు

సీఎం సినిమా చూడకూడదా?. చూస్తే తప్పా?. అదేమీ కాదు. ముఖ్యమంత్రే కాదు..ప్రధాన మంత్రి కూడా సినిమా చూడొచ్చు. కానీ ఆయన అసలు ఆఫీసుకు రాకుండా సినిమాకు పోవటంపైనే ఆయన అభ్యంతరం అంతా. ఆ సీఎం ఎవరు అనుకుంటున్నారా?. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి విమర్శలు గుప్పించారు బహిష్కృత నేత కపిల్ మిశ్రా. కేజ్రీవాల్‌కు సీఎం ఆఫీసుకు వెళ్లేందుకు సమయం ఉండదుగానీ, సర్కార్‌ 3 సినిమాకు మాత్రం వెళ్లారని అన్నారు. గత ఏడాది మొత్తంలో రెండుసార్లు మాత్రమే ఆయన తన కార్యాలయానికి కేజ్రీవాల్‌ వెళ్లారని చెప్పారు.

                           ‘కేజ్రీవాల్‌ స్నేహితులు, ఆయన బంధువులు ఇళ్లపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తే కేజ్రీవాల్‌ చేస్తున్న అవినీతి మరింత వెలుగులోకి వస్తుంది. ప్రజలను మాత్రం పూర్తిస్థాయిలో పనిచేయాలని విధులకు హాజరుకావాలనే కేజ్రీవాల్‌ వారికి మాత్రం  కనిపించడం మానేశారు. కానీ, సర్కార్‌ 3 సినిమా చూసేందుకు మాత్రం వెళ్లారు’ అని ఆయన అన్నారు. ‘మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులందరిలో కూడా ప్రజలను అతి తక్కువ సార్లు కలిసిన ముఖ్యమంత్రి కేజ్రీవాలే. త్వరలోనే ఆయన అవినీతి బాగోతంపై ప్రజలే మాట్లాడతారని, ఒక క్రిమినల్‌ మాదిరిగా కేజ్రీవాల్‌ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here