Home Telugu సీఎం కారే కొట్టేశారు

సీఎం కారే కొట్టేశారు

arvind kejriwal car

అవును. మీరు చదువుతున్నది నిజమే. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కారునే దొంగలు పట్టుకెళ్లారు. ఈ వ్యవహారం ఢిల్లీలో పెద్ద కలకలం రేపింది. ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు..దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ది. అది కూడా పూర్తి భధ్రతా ఏర్పాట్లు ఉండే సెక్రటేరియట్‌ నుంచి దొంగలు కారును ఎత్తుకెళ్లడం అధికారులను కూడా షాక్ కి గురిచేస్తోంది. దొంగిలించబడిన బ్లూ కలర్‌ వాగన్‌ ఆర్‌ కారుతో కేజ్రీవాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.

                               తన కారు చోరీకి గురవడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమం‍త్రి కారు చోరీకి గురవడంపై సెక్రటేరియట్‌ భద్రతాధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే సీఎం కారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు  మాత్రం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here