Home Latest News ఎయిర్ హోస్టేస్ అనుమానాస్పద మృతి

ఎయిర్ హోస్టేస్ అనుమానాస్పద మృతి

clara kongset

ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఎయిర్ హోస్టేస్ అత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఓ పార్టీకి హాజరైన ఆమె చనిపోయి కన్పించటంతో అందరూ అవాక్కు అయ్యారు.అయితే ఆమె మరణానికి కారణాలు తెలియటం లేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. షిల్లాంగ్‌కు చెందిన క్లారా ఖాంగ్‌సిట్ (22) ఇండిగో ఎయిర్‌లైన్స్‌ లో ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొందరు మిత్రులతో కలిసి ఓ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు హాజరైంది.

                               స్నేహితులతో కలిసి క్లారా హుషారుగా పార్టీ చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అపార్ట్‌ మెంట్‌ నాలుగో అంతస్తు కిటికీ నుంచి కింద పడిపోయి క్లారా మృతిచెందింది. బుధవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎయిర్ హోస్టెస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అపార్ట్‌మెంట్లో ఉన్న క్లారా ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీసులు విచారించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here