Telugu Gateway
Cinema

బీడీ త్రీడిలో కనిపిస్తుందా?

బీడీ త్రీడిలో కనిపిస్తుందా?
X

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇదే. అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో. దీంతో ఈ సినిమా పై అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్ లో జోష్ పెంచేలా ఈ సినిమా కు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి ఉప శీర్షికగా ఎక్కువగా మండేది అని పెట్టారు. ఈ సినిమా లో మహేష్ బాబు కు జోడిగా పూజ హెగ్డే, శ్రీలీల సందడి చేయనున్నారు.

మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన వీడియో లో ఏంది అట్లా చూస్తున్నారు...బీడీ త్రీడీలో కనిపిస్తుందా? అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగు హై లైట్ గా నిలుస్తుంది. మాస్ ను టార్గెట్ గా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ మాస్ స్ట్రైక్ చూస్తే అర్ధం అవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణ సంస్థగా ఉంది. గుంటూరు కారం సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గుంటూరు కారం సినిమా 2024 జనవరి 13 న విడుదల కానుంది. అంటే ఈ సారి సంక్రాంతి బరిలో మహేష్ బాబు ఫిక్స్ అయినట్లే.


Next Story
Share it