Telugu Gateway
Cinema

శ్రీ విష్ణు కొత్త సినిమా రెడీ

శ్రీ విష్ణు కొత్త సినిమా రెడీ
X

గత ఏడాది సామజవరగమన సినిమా తో హీరో శ్రీవిష్ణు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అంతే కాదు శ్రీ విష్ణు సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది కూడా ఈ సినిమానే. ఇప్పుడు ఈ యువ హీరో మరో వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ కొత్త సినిమా పేరు ఓం భీమ్ బుష్ (ఓబిబి)..నో లాజిక్ ఓన్లీ మేజిక్ అంటే ట్యాగ్ లైన్ తో వస్తున్నాడు.ఈ సినిమా మార్చి 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఉన్న వెరైటీ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Next Story
Share it