Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ 'రాము' డొచ్చాడు

ఆర్ఆర్ఆర్ రాము డొచ్చాడు
X

ఉద‌యం భీమ్. సాయంత్రం రామ్. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ దూకుడు పెంచింది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ను పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన న్యూలుక్ ను చిత్ర యూనిట్ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభ‌ట్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధం అయింది.

జ‌న‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 9న విడుదల కానుంది. అదే రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి థియేట‌ర్ల‌లో కూడా ట్రైల‌ర్ ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ ను ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

Next Story
Share it