Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 3న

ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 3న
X

ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల తేదీ ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మీడియాకు జ‌న‌ని పాట‌ను ప్ర‌త్యేకంగా ప‌ద‌ర్శించిన సంద‌ర్భంలోనే డిసెంబ‌ర్ తొలి వారంలో ట్రైల‌ర్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు..ఇక వ‌ర‌స పెట్టి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని..చిత్ర యూనిట్ అంతా క‌ల‌సి మీడియా ముందుకు వ‌స్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు కీల‌క పాత్రలు పోషించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల‌లో విప‌రీత జాప్యం జ‌రిగింది.

Next Story
Share it