Telugu Gateway
Cinema

ఈగల్ కొత్త డేట్

ఈగల్ కొత్త డేట్
X

మారింది తేదీ మాత్రమే...మాసోడి మార్క్ కాదు అంటూ ఈగల్ టీం శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈగల్ సినిమా కూడా జనవరి 13 న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఈ సారి సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు కీలక సినిమాలు ఉండటంతో రవి తేజ హీరోగా నటించిన ఈగల్ సినిమాను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 9 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమ బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం అని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రతి సారి సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉంటాయి. అయితే ఈ సారి అనూహ్యంగా ఐదు సినిమాలు ఉండటంతో థియేటర్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారింది.

మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హను మాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా సినిమాలు ఉన్నాయి. అయితే మహేష్ బాబు, తేజ సజ్జ సినిమాలు జనవరి 12 విడుదల చేయాలని నిర్ణయించగా..ముందు సైంధవ్ తో పాటు ఈగల్ కూడా జనవరి 13 న, నా సామిరంగా జనవరి 14 న ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈగల్ డ్రాప్ అవ్వటంతో కొంత ఊరట లభించినట్లు అయింది అని పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. దీంతో మిగిలిన సినిమాలు అన్ని ముందు ప్లాన్ చేసిన డేట్స్ ప్రకారమే విడుదల కాబోతున్నాయి.

Next Story
Share it