Telugu Gateway
Cinema

ర‌ష్మిక.. 25 మిలియ‌న్ల క్ల‌బ్ లో

ర‌ష్మిక.. 25 మిలియ‌న్ల క్ల‌బ్ లో
X

ర‌ష్మిక మంద‌న ఫుల్ హ్యాపీ. తాజాగా ఆమె అల్లు అర్జున్ తో క‌ల‌సి చేసిన సినిమా పుష్ప దుమ్మురేపుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో ర‌ష్మిక న‌ట‌న‌కు కూడా పెద్ద ఎత్తున ప్రశంస‌లు వ‌స్తున్నాయి. తొలిసారి డీగ్లామ‌ర్ పాత్ర‌లో..చిత్తూరు యాస‌లో ఆక‌ట్టుకుంది ఈ భామ‌. టాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు అన్నీ చాలా వ‌ర‌కూ హిట్సే కావ‌టంతో ఆమెకు అవ‌కాశాలు కూడా అదే స్థాయిలో వ‌స్తున్నాయి.

అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ర‌ష్మిక మంద‌న ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 25.8 మిలియ‌న్ల‌ను దాటేసింది. దీంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కేక్ క‌ట్ చేసి మ‌రీ పండ‌గ చేసుకుంది. త‌న‌కు ఇప్పుడు 25.8 మిలియ‌న్ల ఇన్ స్టా కుటుంబం ఉంద‌ని..ల‌వ్ యూ అల్ అంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

Next Story
Share it