Telugu Gateway
Cinema

సమ్మర్ లో ప్రభాస్ సందడి

సమ్మర్ లో ప్రభాస్ సందడి
X

సలార్ సూపర్ సక్సెస్ తో ప్రభాస్ తో పాటు అయన ఫాన్స్ లో కూడా ఫుల్ జోష్ వచ్చింది. ఇప్పుడు అందరూ ఈ పాన్ ఇండియా హీరో కొత్త సినిమా కల్కి 2898 ఏడి విడుదలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంచలన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే కల్కి సినిమా ఈ వేసవిలో అంటే...మే 9 విడుదల అయ్యే అవకాశం ఉంది అని టాలీవుడ్ టాక్. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కు ఈ తేదీ ఎంతో కలిసి వచ్చిన డేట్ అని...అందుకే మే 9 ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది అని బలంగా చెపుతున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారంగా స్పందించాల్సి ఉంది. సైన్స్, ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కల్కి లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ కు జోడి గా ఈ సినిమాలో దీపికా పడుకొనే నటిస్తోంది. సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చెపుతున్నారు. వరస పరాజయాల తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఏమి కోరుకున్నారో అవి ఇవ్వటంతో అక్కడక్కడ విమర్శలు వచ్చినా సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి రాబోయే ప్రభాస్ సినిమా లపై అంచనాలు మరింత పెరగటానికి ఇది దోహదపడింది అనే చెప్పాలి.

Next Story
Share it