Telugu Gateway
Cinema

ప్రభాస్ ఆదిపురుష్ రికార్డు వసూళ్లు

ప్రభాస్ ఆదిపురుష్ రికార్డు వసూళ్లు
X

పాన్ ఇండియా హీరో ప్రభాస్ దుమ్ము రేపుతున్నారు. ఎన్ని వివాదాలు ఉన్నా...విమర్శలు ఎన్ని ఎదురైనా కూడా అయన హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా వసూళ్ల విషయంలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదల అయిన తొలి రోజు అంటే జూన్ 16 న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అన్ని వర్గాల ప్రేక్షుకులను తమ సినిమా ఆకట్టుకుంది అని ...ఫ్యామిలి బ్లాక్ బస్టర్ గా నిలిచినట్లు వెల్లడించారు. ఇక్కడ మరో విశేషం ఒకటి ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఓపెనింగ్ రోజు వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమా లు ఆరు ఉండగా అందులో మూడు సినిమాలు ప్రభాస్ వి కావటం విశేషం. ఈ జాబితాలో బాహుబలి 2 , సాహో, ఇప్పుడు ఆదిపురుష్ కూడా ఆ లిస్ట్ లో చేరింది. ఆదిపురుష్ సినిమా కు హిందీ లో తొలి రోజు 37 కోట్ల రూపాయల పై వసూళ్లు వచ్చినట్లు చెపుతున్నారు. తెలుగు మార్కెట్ లో వసూళ్లు 58 కోట్ల రూపాయలుగా అంచనా.

భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుంది. సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఈ మూవీ ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో హనుమంతుడితో చెప్పించిన డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కొన్నిచోట్ల కేసులు కూడా పెడుతున్నారు. ఆదిపురుష్ తొలి రోజు వసూళ్ల పై చిత్ర యూనిట్ మాత్రం ఫుల్ హ్యాపీ. వీకెండ్స్ లో కూడా వసూళ్లు ఆశాజకంగానే ఉండే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్లు ప్రచారం. 2023 సంవత్సరంలో పఠాన్ సినిమా మాత్రమే ఓపెనింగ్ రోజు 106 కోట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఈ రికార్డు ను ప్రభాస్ ఆదిపురుష్ అధిగమించి ఏకంగా 140 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

Next Story
Share it