నిహారిక పెళ్ళి తేదీ ఫిక్స్
BY Admin4 Nov 2020 9:39 AM GMT
X
Admin4 Nov 2020 9:39 AM GMT
నటి, నాగబాబు కుమార్తె నిహారిక పెళ్ళి తేదీ ఫిక్స్ అయింది. కరోనా కారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేశారు. ఈ బాధ్యతను నిహారిక అన్న వరుణ్ తేజ్ తీసుకున్నారు.ఇప్పుడు ప్లేస్ తోపాటు ముహుర్తం కూడా ఖరారు అయింది. డిసెంబర్ 9 రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహుర్తంగా నిర్ణయించారు.
ఈ విషయాన్ని వరుడు చైతన్య తండ్రి , గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు తెలిపారు. ఆయన బుధవారం నాడు తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వివాహ పత్రికను స్వామి వారి దగ్గర పెట్టారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉదయ్ విలాస్ ను వేదికగా ఎంపిక చేశారు. ఆగస్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే.
Next Story