Telugu Gateway
Cinema

ఐ డోంట్ కేర్ అంటున్న బాలకృష్ణ

ఐ డోంట్ కేర్ అంటున్న బాలకృష్ణ
X

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్ బికె 108 టైటిల్ వచ్చేసింది. ప్రచారం జరిగినట్లు గానే ఈ సినిమా కు భగవంత్ కేసరి అనే పేరు పెట్టారు. ఉప శీర్షికగా ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ జోడించారు. చిత్ర యూనిట్ గురువారం ఉదయం టైటిల్ తో హీరో బాలకృష్ణ న్యూ లుక్ ను విడుదల చేసింది. అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో ఇది తొలిసినిమా. దీంతో దీనిపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అదే సమయంలో బాలకృష్ణ గత రెండు సినిమా లు అఖండ, వీరసింహ రెడ్డి మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపాయి.దీంతో భగవంత్ కేసరిపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి బాలకృష్ణ ఖాతాలో హ్యాట్రిక్ విజయం నమోదు అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా కాజోల్ అగర్వాల్ నటిస్తుంటే..మరో కీలక పాత్రలో శ్రీ లీల సందడి చేయనుంది. థమన్ ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it