Telugu Gateway
Cinema

మా భ‌వ‌నానికి ఎక‌రం సంపాదించ‌లేక‌పోయారా?

మా భ‌వ‌నానికి ఎక‌రం సంపాదించ‌లేక‌పోయారా?
X

తెలంగాణ ప్ర‌భుత్వంతో రాసుకుపూసుకు తిరిగారు క‌దా.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) భ‌వ‌నానికి ఎక‌రం స్థ‌లం సంపాదించ‌లేక‌పోయారా? అంటూ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌ల్లో అమెరికా వెళ్లి చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 'మా'బిల్డింగ్‌ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే, తాను సహకరిస్తానని చెప్పారు. సినీ పెద్దలంతా కలిసి వస్తే.. ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని బాలయ్య అన్నారు. మా ఎన్నిక‌ల అంశంపైనా బాల‌క్రిష్ణ స్పందించారు.

లోక‌ల్..నాన్ లోక‌ల్ అంశం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇప్పటి వరకు 'మా' బిల్డింగ్‌ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు. గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాజాగా ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Next Story
Share it