Telugu Gateway
Cinema

సూపర్ యోధ గా తేజ సజ్జ (Mirai Telugu Glimpse )

సూపర్ యోధ గా తేజ సజ్జ (Mirai Telugu Glimpse )
X

టాలీవుడ్ లో తేజ సజ్జా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అంటే హను మాన్ అని చెప్పక తప్పదు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద హీరోల పోటీని తట్టుకుని నిలబడటం కాకుండా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హను మాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే. గురువారం నాడు విడుదల అయిన తేజ సజ్జ కొత్త సినిమా మిరాయి గ్లింప్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచింది అనే చెప్పాలి. రెండు నిమిషాల లోపు ఉన్న ఈ గ్లింప్స్ తేజ సజ్జ ను పాన్ ఇండియా హీరో రేంజ్ కు తీసుకు వెళ్లేలా ఉంది అనే చెప్పొచ్చు. ఈ సినిమా కథ చెప్పించిన విధానం చూస్తే హీరో నిఖిల్ కార్తికేయ 2 మూవీ ఛాయలు కనిపిస్తాయని చెప్పాలి.

ఇటీవలే రవి తేజ తో ఈగల్ సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. గ్లింప్స్ లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నది కూడా వెల్లడించారు. మొత్తం ఏడు భాషల్లో విడుదల కానున్న మిరాయి ని ఏప్రిల్ 19న 3డి లో కూడా విడుదల చేయనున్నారు. సామ్రాట్ అశోక కళింగ యుద్ధం పరిణామాల తర్వాత వచ్చిన 9 గ్రంథాలు వాటిని తరాలుగా కాపాడుతూ వస్తున్నా 9 మంది యోధులు అంటూ ఓ రేంజ్ ఆసక్తిని ఈ గ్లింప్స్ కలిగించింది అనే చెప్పాలి. ఇందులోని విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తి పెంచేలా ఉన్నాయనే చెప్పాలి. ఈ సినిమా కు కూడా హను మాన్ మ్యూజిక్ దర్శకుడు గౌర హరి నే సంగీతం అందిస్తుండగా తన స్కోర్ ఈ టీజర్ గ్లింప్స్ లో మరింత ఆకర్షణగా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ.

Next Story
Share it