Telugu Gateway
Cinema

మా..మా..మ‌హేషా వ‌స్తున్నాడు

మా..మా..మ‌హేషా వ‌స్తున్నాడు
X

మాస్ సాంగ్ తో మ‌హేష్ బాబు, కీర్తిసురేష్ శ‌నివారం నాడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ఈ పాట‌కు సంబంధించిన న్యూలుక్ తో అప్ డేట్ ఇచ్చింది. శ‌నివారం నాడే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన సినిమా ట్రైల‌ర్ మంచి స్పంద‌న ద‌క్కించుకుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ట్రైల‌ర్ కంటే ఇంకా ఎన్నో రెట్లు ఎంట‌ర్ టైన్ మెంట్ త‌మ సినిమాలో ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శ్ రామ్ ప్ర‌క‌టించారు. మే12న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఫ్యామిలీతో క‌ల‌సి పారిస్ లో వెకేష‌న్ ఎంజాయ్ చేసి వ‌చ్చిన మహేష్ బాబు శ‌నివారం నాడు జ‌రిగే ప్రీ రిలిజ్ ఈవెంట్ లో పాల్గొన‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ డైర‌క్ట‌ర్లు అతిధులుగా హాజ‌ర‌వుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Next Story
Share it