Telugu Gateway
Cinema

వినాయ‌క‌చ‌వితికి 'లవ్‌స్టోరీ' మూవీ

వినాయ‌క‌చ‌వితికి లవ్‌స్టోరీ మూవీ
X

సారంగ ద‌రియా పాట టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది . ఈ పాట‌తో 'లవ్‌స్టోరీ' సినిమాకు కూడా ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చింది. పాట‌...పాట‌కు త‌గ్గ డ్యాన్స్ లు. అందులో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎట్టకేల‌కు స‌మ‌స్య‌లు అన్నీ అధిగ‌మించి 'లవ్‌స్టోరీ' సినిమా విడుద‌ల ముహుర్తం ఖ‌రారైంది. వినాయ‌క‌చ‌వితికి ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

ఈ మేర‌కు చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌టించిన విష‌యం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. వినాయకచవితి' పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలుపుతూ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుద‌ల చేశారు.

Next Story
Share it