Telugu Gateway
Cinema

'లైగర్' విడుదల సెప్టెంబర్ 9న

లైగర్ విడుదల సెప్టెంబర్ 9న
X

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమా విడుదల తేదీ వచ్చేసింది. చిత్ర యూనిట్ ముందు ప్రకటించినట్లుగానే గురువారం ఉదయం ఈ తేదీని ప్రకటించేసింది. సెప్టెంబర్ 9న లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే నటిస్తోంది.

పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతే కాదు..పూరీ కనెక్ట్స్ తోపాటు కరణ్ జోహర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. విజయర్ దేవరకొండ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే.

Next Story
Share it