Telugu Gateway
Cinema

ప్ర‌త్యేక పాట‌లో దుమ్మురేపిన త‌మ‌న్నా

ప్ర‌త్యేక పాట‌లో దుమ్మురేపిన త‌మ‌న్నా
X

త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో ఉంది అంటే ఆ సంద‌డే వేరు. స‌రి లేరు నీకెవ్వ‌రు సినిమాలో మ‌హేష్ బాబు తో క‌ల‌సి ఈ భామ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న గ‌ని సినిమాలో కూడా ప్ర‌త్యేక గీతం చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుద‌ల చేసింది. ఇందులోనూ త‌మ‌న్నా త‌న స్టెప్పుల‌తో దుమ్మురేపింది. సినిమాకు ఈ పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న‌టంలో సందేహం లేదు. గ‌నిలో వ‌రుణ్ తేజ్ కు జోడీగా సయి మంజ్రేక‌ర్ న‌టించింది. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప‌లు వాయిదాల అనంత‌రం ఏప్రిల్ 8న విడుద‌ల కానుంది.

Next Story
Share it