Telugu Gateway
Cinema

జైలర్ రికార్డు లు బద్దలు కొడుతున్నాడు

జైలర్ రికార్డు లు బద్దలు కొడుతున్నాడు
X

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా వసూళ్ల విషయంలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 214 .15 కోట్ల రూపాయల గ్రాస్, 105.10 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈ సినిమా కు 23.65 కోట్ల రూపాయల గ్రాస్ 13 .81 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. చాలా కాలం తర్వాత జైలర్ సినిమా లో ప్రేక్షుకులు పాత రజని కాంత్ ను చూశారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రొటీన్ కథనే ఆకట్టుకునేలా చెప్పటంలో విజయవంతం అయ్యారు. జైలర్ విడుదల అయిన తర్వాత ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షుకుల ముందుకు వచ్చిన చిరంజీవి సినిమా భోళా శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.

అదే సమయంలో జైలర్ మూవీ కి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో అభిమానంతో సంబంధం లేకుండా కేవలం ఎంటర్టైన్ మెంట్ కోరుకొనే ప్రేక్షకులు జైలర్ వైపు వెళ్లిపోయారు. ఈ ఆదివారం వసూళ్లు కూడా కలుపుకుంటే జైలర్ మరింత దూసుకుపోవటం ఖాయం. రజనీకాంత్ సినిమా కు సహజంగానే అయన సొంత రాష్ట్రం అయిన తమిళనాడులోనే అత్యధిక వసూళ్లు వస్తాయి. అక్కడ మూడు రోజులకు అరవై కోట్ల రూపాయలు రాగా . తర్వాత అత్యధిక వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కర్ణాటకలో 22 .75 కోట్ల రూపాయలు గ్రాస్, కేరళ లో 16 .10 కోట్ల రూపాయల వసూలు వచ్చాయి.

Next Story
Share it