Telugu Gateway
Cinema

రవి తేజ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

రవి తేజ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
X

రవి తేజ ఈగల్ సినిమా ఓటిటి లోకి వస్తోంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకుని ఫిబ్రవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన కే పరిమితం అయింది. కథ కంటే కూడా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రవి తేజ కు జోడిగా ఇందులో కావ్య థాపర్ నటిస్తే ...మరో కీలక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే. నెల రోజులు కూడా కాకుండానే ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ మూవీ ప్రముఖ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ తో పాటు ఈటివి విన్ లో కూడా వీక్షించవచ్చు. మార్చి ఒకటి నుంచే ఈగల్ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. అర్హుల చేతిలోనే ఆయుధాలు ఉండాలి అనే స్టోరీ లైన్ తీసుకుని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా ను తెరకెక్కించారు.

Next Story
Share it