Telugu Gateway
Cinema

దసరా వంద కోట్ల సందడి

దసరా వంద కోట్ల సందడి
X

హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా సినిమా దసరా. ఈ సినిమా పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కలెక్షన్స్ద మాత్రం దుమ్ము రేపుతున్నాయి. ఈ మూవీ లో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ నటన విషయంలో ఎక్కడా ప్రతికూల కామెంట్స్ లేకపోయినా కథలో కొత్తదనం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే తొలిసారి దర్శకత్వం వహించిన సినిమాతోనే వంద కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరాడు శ్రీకాంత్ ఓదెల. నాని ఊర మాస్ పాతరలో దుమ్మురేపాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజులకు గాను వందకోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అంతే కాదు చిత్ర విజయంతో నిర్మాత చెరుకూరి సుధాకర్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు ఖరీదైన బిఎండబ్ల్యూ కార్ బహుమతిగా ఇచ్చాడు. నాని సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా దసరా నిలవటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. నాని దసరాకు ప్రముఖ దర్శకుల నుంచి మొదలుపెట్టి ప్రముఖ హీరోలు కూడా ప్రశంసలు కురిపించారు. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది..సంబరాలు చేసుకుంటోంది.

Next Story
Share it