Telugu Gateway
Cinema

‘దసరా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా‘!

‘దసరా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా‘!
X

హీరో నాని తొలి పాన్ ఇండియా సినిమా దసరా. శ్రీరామనవమి రోజు విడుదల అయిన ఈ సినిమా వసూళ్ల విషయంలో దుమ్ము రేపింది. ఈ మూవీ లో స్టోరీ వీక్ గా ఉన్నా నటన విషయంలో మాత్రం నాని, కీర్తి సురేష్ లు ఇరగదీసారు అనే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ డే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుకుని 24 .85 కోట్ల రూపాయల గ్రాస్, 14 .22 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది. పాన్ ఇండియాగా విడుదల అయిన ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా 38 .40 కోట్ల రూపాయల గ్రాస్, నికర వసూళ్లు 21 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ సినిమా లోని పాటలు దసరా పై అంచనాలను గణనీయంగా పెంచాయి. ఇది ఓపెనింగ్ కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉండటానికి దోహదపడింది.

అదే సమయంలో హీరో నాని కూడా ఈ సినిమాపై ఒక రేంజ్ ఎలేవేషన్స్ ఇచ్చారు. అయితే సినిమా విడుదల అయిన తర్వాత నాని, కీర్తి సురేష్ నటనలకు మంచి మార్కులే పడ్డా మొత్తంమీద సినిమా పై మాత్రం ఆ రేంజ్ టాక్ రాలేదు అనే చెప్పాలి. అయితే ఈ వారం ఒక్క నాని దసరా తప్ప చెప్పుకోదగ్గ సినిమా మరొకటి లేకపోవటం, వారాంతం కలెక్షన్స్ కూడా కలుపుకుంటే ఈ సినిమా వసూళ్ల విషయంలో మంచి ఫలితాలనే సాధించే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it