Telugu Gateway
Cinema

వాల్తేరు వీరయ్య డేట్ ఫిక్స్

వాల్తేరు వీరయ్య డేట్ ఫిక్స్
X

సంక్రాతి సినిమా ల తేదీలు ఫిక్స్ అయ్యాయి. ఇప్పటికే బాల కృష్ణ హీరో గా నటించిన వీర సింహ రెడ్డి, తమిళ్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమాలు జనవరి 12 న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య డేట్ ఫిక్స్ అయింది. అంటే ఈ రెండు సినిమాలు విడుదల అయినా ఒక రోజు తర్వాత అంటే జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో చిరంజీవికి జోడి గా శృతి హాసన్ నటించారు. దీంతో ఈ సంక్రాంతికి వచ్చే మూడు కీలక సినిమాల తేదీలు ఫిక్స్ అయినట్లు అయింది. వీటితోనే ఆగిపోతాయా లేక కొత్తవికూడా బరిలోకి వస్తాయా అన్నది వేచిచూడాలి. ఇప్పటివరకు ఉన్న వాటి ప్రకారం చూస్తే రెండు డైరెక్ట్ సినిమాలు, ఒకటి డబ్బింగ్ సినిమా వారసుడు పండగ చేయనున్నాయి. మరి ఈ సారి సంక్రాంతి విజేతగా ఎవరు నిలుస్తారో వేచిచూడాలి.

Next Story
Share it