Home Latest News ఉత్తర కొరియాకు చైనా షాక్!

ఉత్తర కొరియాకు చైనా షాక్!

kimjong

దూకుడు వద్దు. తేడా వస్తే మీ చావు మీరే చావాల్సి ఉంటుంది. మేం జోక్యం చేసుకోలేం. కానీ అమెరికా మాత్రం ముందు అణ్వస్త్రాలు ప్రయోగిస్తే అప్పుడు మాత్రమే మేం రంగంలోకి దిగుతామని చైనా ప్రకటించింది. అమెరికా..ఉత్తర కొరియా మధ్య ప్రస్తుతం మాటల యుద్దం సాగుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి చేయి దాటితే కష్టమని భావించిన చైనా రంగంలోకి దిగింది. అందులో భాగంగానే ఉత్తర కొరియాను హెచ్చరించింది. దూకుడు చర్యలు ఆపకుంటే తాము ఏం చేయలేమని స్పష్టం చేసింది. అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించి అనర్థం కొని తెచ్చుకుంటే జరగబోయే పరిణామాలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము సాయంగా రాబోమని తెలిపింది.     ఈ మేరకు చైనాకు చెందిన అధికారిక మీడియా పత్రికలో స్పష్టం చేసింది. అయితే, ఒకవేళ అమెరికానే ముందుగా క్షిపణులు ప్రయోగిస్తే అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని కూడా తెలిపింది.

                         చైనా అతిపెద్ద పార్టీ అయిన కమ్యునిస్టు పార్టీ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో వెలువడిన ప్రకారం అమెరికా వైమానిక స్థావరాలపై తాను క్షిపణుల ప్రయోగిస్తానంటూ ఉత్తర కొరియా బెదిరిస్తూ వస్తుంది. నిజంగానే అమెరికా భూభాగంలోకి ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగిస్తే తాము సహాయం చేసేందుకు రాబోమని చైనా పేర్కొంది. ఇరు దేశాల్లో దేని పక్షాన ఉండకుండా తటస్థంగా ఉంటామని, పరిస్థితులు ఉత్తర కొరియానే ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒక వేళ అమెరికానే ముందుగా ఉత్తర కొరియాపై క్షిపణి ప్రయోగాలు చేస్తే.. దాని ప్రభావం తమ దేశంపై పడితే అప్పుడు జోక్యం చేసుకొని ఎలాంటి అనర్ధం జరగకుండా చూస్తామని స్పష్టం చేసింది. అయితే దీనిపై ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here