Home Andhra Pradesh చంద్రబాబు సర్కారు ‘అవినీతి దీక్ష’

చంద్రబాబు సర్కారు ‘అవినీతి దీక్ష’

chandrababu-naidu

‘పట్టిసీమలో అవినీతి. పోలవరంలో అవినీతి. సీసీటీవీ కెమెరాల కొనుగోలులో స్కాం. పుష్కరాల పనుల్లో గోల్ మాల్. ఇసుకలోనూ కోట్లు తింటున్న వైనం. స్విస్ ఛాలెంజ్ లో భారీ స్కాం. పారిశ్రామిక రాయితీల్లోనూ చిలక్కొట్టుడు. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా ప్రతి దాంట్లోనూ కోట్లకు కోట్లు దోచుకోవటమే. అంచనాలు పెంచుకో..అందినంత దండుకో.’ ఇదీ ఏపీలో చంద్రబాబు సర్కారు తీరు.  వైఎస్ హయాంలో సాగిన దాని కంటే ఎక్కువగా చంద్రబాబు హయంలో అవినీతి సాగుతోందని సాక్ష్యాత్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులే అవాక్కు అవుతున్నారు. విశాఖపట్నంలో భూ కుంభకోణం జడలు విప్పి నాట్యం చేస్తోందని సాక్ష్యాత్తూ చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రి అయ్యన్నపాత్రుడే బహిరంగంగా ప్రకటించారు. ఇక అమరావతి రోడ్లు మొదలుకుని..నిర్మాణాల వరకూ ప్రతి విషయంలోనూ భారీ ఎత్తున సెటిల్మెంట్లే. ఇక రహదారుల భవనాల శాఖ అవినీతిలో అయితే రికార్డులు సృష్టిస్తోంది. ఏపీలో ఏ ఇంజనీర్ పై ఏసీబీ దాడి చేసినా కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బయటపడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

                          ఇన్ని అంశాలు కళ్ళ మందు కన్పిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు నవ నిర్మాణ దీక్ష పేరుతో విజయవాడలో మంత్రులు…ప్రజలతో దీక్ష చేయించారు. అందులో తొలి అంశమే అవినీతి గురించి ప్రస్తావించటంపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఏపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అవినీతి బహిరంగంగా  జరుగుతున్నా…చంద్రబాబు అవేమీ పట్టనట్లు నవ నిర్మాణదీక్షలో అవినీతి గురించి ప్రస్తావించటం విశేషం. విజయవాడలో ఎంతో ప్రచారం కల్పించినా చంద్రబాబు నిర్వహించిన ఈ నవనిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ దీక్షకు జనం రాక వెలవెలపోయింది. అతి తక్కువ మంది మాత్రమే దీనికి హాజరయ్యారు. దీని కోసం గంటల తరబడ వివిధ మార్గాల్లో  ప్రయాణించే వారిని ఇబ్బందులు పాలు చేశారు. ఏదైనా ప్రజా సమస్యపై విపక్షాలు బంద్ కు పిలుపునిస్తే పోలీసులను బట్టి అడ్డుకునే సీఎం చంద్రబాబు స్వయంగా తానే  ప్రజలకు మాత్రం గంటలకు గంటలు అసౌక్యం కల్పంచటం విశేషం.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here