Home Andhra Pradesh చంద్రబాబు చీప్ ట్రిక్స్ మరీ ఇంతగానా

చంద్రబాబు చీప్ ట్రిక్స్ మరీ ఇంతగానా

chandrababu-naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చీప్ ట్రిక్స్ పీక్ కు వెళ్ళాయి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచటానికి ఆయన మనవడిని చూడటానికి హైదరాబాద్ కూడా వెళ్లటం లేదట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్ష్యాత్తూ ఆయన సీఆర్ డీఏ సమావేశంలో చెప్పటం. దాన్ని సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటన రూపంలో ఇవ్వటం లేదు. ఇది చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు సీఎం మనవడికి..అమరావతి బ్రాండ్ కు సంబంధం ఏమిటి అని?. సీఆర్ డీఏ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు..సీఎం కార్యాలయం పంపిన ప్రెస్ నోట్ పాయింట్లు ఏమిటో మీరే చూడండి. ‘శని, ఆదివారాల్లో సైతం తాను మనవణ్ణి చూడ్డానికి హైదరాబాద్ పోకుండా అమరావతి బ్రాండింగ్ కోసం ఇక్కడే వుంటున్నానని, పెరుగుతున్న అమరావతి బ్రాండ్‌కు అనుగుణంగా వెంటనే 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు వస్తే అంతర్జాతీయంగా రాకపోకలు పెరుగుతాయని చెప్పారు. సోషల్, హాస్పిటాలిటీ కార్యకలాపాలు పెరిగిన నాడే అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అన్నారు.’ ఇదీ ఆ ప్రకటన.

                                      ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కష్టపడుతున్నారనే అనుకుందాం.  ఓ రెండు రోజుల పాటు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి ఆయన మనవడిని చూసి వస్తే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందా?. అసలు ఇంకా మొదలే కానీ అమరావతి నిర్మాణ పనులు ఆగిపోతాయా?. లేక ఆయనే దగ్గరుండి బిల్డింగ్ లు కట్టిస్తారా?. అసలు ఆయన మనవడిని చూడటానికి …అమరావతికి సంబంధం ఏంటి? వారం వారం సీఆర్ డీఏ సమావేశాలు పెట్టడం తప్ప..మూడేళ్లు పూర్తయినా కనీసం డిజైన్లను ఖరారు చేయించటంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇవన్నీ వదిలేసి ఈ చీప్ ట్రిక్స్ తో ప్రజల మెప్పు పొందగలరా?. అసలు అధికారిక సమీక్షలో మనవడి అంశం ప్రస్తావన ఎందుకు?.. పైగా అది మళ్లీ ప్రెస్ నోట్ లో పెట్టడం. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల్లోనే చంద్రబాబు సర్కారు చక్కదనం కన్పించింది. సొంత పార్టీకి చెందిన నేతలే వీటిపై విమర్శలు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here