Home Andhra Pradesh భూ స్కామ్ లో ‘చంద్రబాబు మాయ ఇదే’!

భూ స్కామ్ లో ‘చంద్రబాబు మాయ ఇదే’!

Chandrababu-Naidu

విశాఖలో లక్షల ఎకరాల భూమి రికార్డులు మాయం అయినట్లే..సిట్ విచారణ నుంచి ఆ మండలం కూడా మాయం అయిందా?. భూ స్కామ్ లో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నారా?. అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్న భూ స్కామ్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ పై తూతూ మంత్రంగా ‘సిట్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నా….గంటా శ్రీనివాసరావు…ఆయన బినామీలతో దందా సాగించిన అత్యంత కీలకమైన భీమునిపట్నం మండలాన్ని సిట్ పరిధిలో చేర్చలేదని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాక్ష్యాత్తూ  ఏపీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ  మంత్రి కె ఈ కృష్ణమూర్తి కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని… సిట్ మధురవాడ, కొమ్మాడి తదితర ప్రాంతాల్లోని జరిగిన లావాదేవీలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. కానీ కీలక స్కామ్ …వందల ఎకరాల గంటా అనుచరులు..బినామీలు సాగించిన వ్యవహారం అంతా భీమునిపట్నం మండలంలో ఉందని…రెవన్యూ మంత్రే ఈ విషయాన్ని ప్రస్తావించకపోవటంతో సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన మంత్రివర్గ సహచరుడు గంటా శ్రీనివాసరావును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

                                   అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి కెఈతో భీమునిపట్నం మండలం పేరును చెప్పించలేదని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో విశాఖపట్నంలో జరిగిన వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంలో అసలు డ్రామా అంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీలో అత్యంత సీనియర్ నేత, సీనియర్ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడు బహిరంగంగా విశాఖలో భూ స్కామ్ జరిగిందని ప్రకటించారు. ఇది జరిగిన చాలా రోజుల వరకూ చంద్రబాబు మౌనాన్నే ఆశ్రయించారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావే సీబీఐ, సిట్టింగ్ జడ్జి విచారణ కావాలని కోరుతున్నారు. నిజంగా మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పింది తప్పు అయితే ఆయనపై అయినా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి…మంత్రి గంటా పాత్ర ఉంటే ఆయనపై అయినా చర్యలు తీసుకోవాలి. ఎవరినీ ఏమీ అనకుండా చంద్రబాబు మాత్రం ఈస్కామ్ దానంతట అది చచ్చిపోయేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే విశాఖ భూ స్కామ్ లో సీఎం చంద్రబాబు…ఆయన తనయుడు నారా లోకేష్ ల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయని  ఓ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here